Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి వైసీపీ మ‌ద్ద‌తు

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి వైసీపీ మ‌ద్ద‌తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి వైసీపీ అధినేత జగన్ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైసిపి విధానంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. నేడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే విధానంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చాం’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే, తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకునేది కాదని ఆయన కొట్టిపారేశారు.. అలాగైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణాదికి చెందినవారు కదా? అని బొత్స ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -