Thursday, September 25, 2025
E-PAPER
Homeనల్లగొండబీర్ల అనిత ఐలయ్యలకు జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు       

బీర్ల అనిత ఐలయ్యలకు జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు       

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత కు బుధవారం రాత్రి  జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు సినీ యాక్టర్ తనికెళ్ల భరణి చేతుల మీదుగా ప్రధానం చేసి సన్మానించారు. ఆరు సంవత్సరాలుగా బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ గా బీర్ల అనిత పేద విద్యార్థుల చదువులకు  పేద మహిళల పెళ్లికి ఆర్థిక సహాయం గ్రామాలలో తాగునీటి వాటర్ ప్లాంట్ల ఏర్పాట్లు,వితంతు వికలాంగులకు ఇంటి నిర్మాణాలకు సిమెంటు పంపిణీ, ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్లు జరుగుతే అంబులెన్స్ తక్షణం పంపించడం నిరుపేదలకు వైద్య ఖర్చులు ఇవ్వడం,చనిపోయిన పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ బిర్ల ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో వేలాది మందికి చేయూతనివ్వడం జరిగింది.   ఆరు సంవత్సరాలుగా చేస్తున్న సేవను గుర్తించి హైదరాబాద్ జలవిహార్ లో  జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు ఇచ్చి సత్కరించారు.ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.జీ తెలుగు న్యూస్ యాజమాన్యంతో పాటు అభినందించారు.బీర్ల అనిత మాట్లాడుతూ జీ తెలుగు న్యూస్ బీర్ల ఫౌండేషన్ సేవలు గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.సమాజం బాగుంటేనే మనం బాగుంటాం అని సమాజం చేతనైనంత సహాయం అందించడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్నారు.ముఖ్యంగా పేదలు మహిళలకు వికలాంగులు వితంతువులను విద్యార్థులను ఆదరించడం బీర్ల ఫౌండేషన్ శక్తి మేరకు సహాయం  అందించడానికి కృషి జరుగుతుందన్నారు.సహాయం పొందిన ప్రజల కళ్ళలో ఆనందం చూస్తే ఎంతో పుణ్యం చేసుకున్న భావన కలుగుతుంది అన్నారు.తనకు వెన్నంటి ఉంటూ తోడ్పాటు ఇచ్చి ముందుకు నడిపిస్తున్న తన భర్త ప్రభుత్వ విప్  ఐలయ్య తనకొచ్చిన అవార్డు అక్కనిచ్చిన ప్రోత్సహం వల్లనే వచ్చిందన్నారు. అవార్డు ప్రధానం చేసినందుకు జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -