Monday, May 12, 2025
Homeఅంతర్జాతీయంపుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమే: జెలెన్‌స్కీ

పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమే: జెలెన్‌స్కీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ర‌ష్యా ప్ర‌క‌టించిన‌ శాంతి చ‌ర్చ‌ల‌ పిలుపున‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. రష్యా అధినేత పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే అని ఆయ‌న‌య గుర్తుచేశారు. ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేద‌ని. రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామ‌ని, రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అంత‌కుముందు కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -