• అనుకూల శిక్షణ,ప్రత్యక్ష పర్యవేక్షణ,డేటా-ఆధారిత పనితీరు అంచనా కోసం ఏఐ -ఆధారిత ఇన్‌స్ట్రక్టర్ ఆపరేటర్ స్టేషన్ (ఐఓఎస్).
• లీనమయ్యే రీతిలో సమగ్ర దృశ్యమాన్యత, 6-DOF మోషన్ ప్లాట్‌ఫారమ్‌లు EO/IRటార్గెటింగ్ సిస్టమ్‌లను కలిగి ఉంది.
నవతెలంగాణ హైదరాబాద్: జెన్ టెక్నాలజీస్,తమ అనుబంధ సంస్థ అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ (ఏఆర్ఐ) సిమ్యులేషన్ ద్వారా అధునాతన ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (ఎఫ్ఏసి) సిమ్యులేటర్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆధునిక సముద్ర యుద్ధ సంక్లిష్టతలకనుగుణంగా నావికాదళ ఆపరేటర్లు, పోరాట సిబ్బందిని సిద్ధం చేయడానికి రూపొందించబడిన అత్యాధునిక శిక్షణ పరిష్కారమిది.
ఓడల నిర్వహణ,నావిగేషన్,పోరాట వ్యూహాలు,రిమోట్ ఆయుధ అనుసంధానత కోసం వాస్తవ-ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అధిక-విశ్వసనీయ, పూర్తిగా సమీకృత వాతావరణాన్ని ఎఫ్ఏసి సిమ్యులే అందిస్తుంది. లీనమయ్యే రీతిలో సమగ్ర దృశ్యమాన్యత, 6-DOF మోషన్ ప్లాట్‌ఫారమ్‌లు EO/IRటార్గెటింగ్ సిస్టమ్‌లను కలిగిన ఈ సిమ్యులేటర్ అసాధారణ పనితీరును అందించటంతో పాటుగా సురక్షితమైన,పునరావృ, మిషన్-రెడీ శిక్షణను నిర్ధారిస్తుంది.
ముఖ్య ఆకర్షణలలో:
• అనుకూల శిక్షణ, ప్రత్యక్ష పర్యవేక్షణ,డేటా-ఆధారిత పనితీరు అంచనా కోసం ఏఐ ఆధారిత ఇన్‌స్ట్రక్టర్ ఆపరేటర్ స్టేషన్ (ఐఓఎస్).
· అనుకూల అభ్యాసం: సిబ్బందిలోని ప్రతి సభ్యునినై, కష్టస్థాయిలు; శిక్షణ ప్రభావవంతంగా మరియు అనుకూలంగా వుంటుందనే భరోసా అందింస్తుంది.
· కార్యాచరణ పరిజ్ఞానం :ఏఐ ఆధారిత పనితీరు విశ్లేషణ ఖచ్చితమైన అభిప్రాయాన్ని అందిస్తుంది,నైపుణ్య అంతరాలను వెల్లడిస్తుంది. అభివృద్ధి మాడ్యూల్‌ను సృష్టిస్తుంది.
• ఫీడ్‌బ్యాక్-ఆధారిత ఇంటర్‌ఫేస్‌లతో వాస్తవిక ప్రొపల్షన్, స్టీరింగ్ నియంత్రణలు.
• రీకాయిల్, ఫైర్ నియంత్రణ వ్యవస్థలతో మీడియం మెషిన్ గన్స్, రిమోట్ వెపన్ స్టేషన్ల అనుకరణ.
• క్లోజ్-క్వార్టర్ డిఫెన్స్ నుండి మల్టీ-యాంగిల్ ఎటాక్, కౌంటర్-అసిమెట్రిక్ ఆపరేషన్ల వరకు సమగ్ర వ్యూహాత్మక దృశ్యాలు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా జెన్ టెక్నాలజీస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ, “దాదాపు 7,500కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న తీరప్రాంతం,విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)కలిగిన భారతదేశం,సముద్ర భద్రత,తీరప్రాంత రక్షణలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ అసాధారణముప్పులను ఎదుర్కోవడం,వాణిజ్య మార్గాలను భద్రపరచడం,నావికా దళ సంసిద్ధతను బలోపేతం చేయడం వంటి పెరుగుతున్న అవసరాలకుఎఫ్ఏసిసిమ్యులేటర్ వంటి అధునాతన శిక్షణ వ్యవస్థలుకీలకంగా నిలుస్తాయి.నావికాదళ శిక్షణ సామర్థ్యంలో ఒక ప్రధాన ముందడుగుగాజెన్ఎఫ్ఏసిసిమ్యునిలుస్తుంది. ఇది వాస్తవికత,భద్రత,సాంకేతికతను మిళితం చేసి శిక్షణ ఖర్చులు,ప్రమాదాలను తగ్గించి వాస్తవ ప్రపంచ మిషన్ల కోసం సిబ్బందిని సిద్ధం చేస్తుంది. జెన్ వద్ద,మా లక్ష్యం ఎల్లప్పుడూ పోరాట సంసిద్ధత మరియు కార్యాచరణ శ్రేష్ఠతను బలోపేతం చేసే అధునాతన,స్వదేశీ పరిష్కారాలతో మా సాయుధ దళాలను సన్నద్ధం చేయడం..” అని అన్నారు.
అధిక-ఒత్తిడి కలిగిన సముద్ర సంబంధమైన పరిస్థితులలో పోరాట సంసిద్ధత,బృంద సమన్వయం మరియు వ్యూహాత్మక నిర్ణయాలనుతీసుకోవడాన్నిప్ఎఫ్ఏసి సిమ్యులేటర్పెంచుతుంది.ఈ ఆవిష్కరణతో,కార్యాచరణ సంసిద్ధత,జాతీయ భద్రతను బలోపేతం చేసే స్వదేశీ,తదుపరి తరం పరిష్కారాలతో నావికాదళ శిక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి జెన్ టెక్నాలజీస్ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.