నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇరు జట్లకు చెరో పాయింట్లు ఇచ్చారు. దీంతో జింబాబ్వే ఐదు పాయింట్‌లతో సూపర్-8కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ సమయంలో వాన కారణంగా ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిలిచిపోవడంతో ఆస్ట్రేలియా జట్టుకు మైనస్ అయింది. ఒకవేళ జింబాబ్వేపై ఐర్లాండ్ గెలిస్తే..ఆసీస్ టీంకు సూపర్-8 అవకాశాలు మెండుగా ఉండేవి. కానీ మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో మెగా టోర్నీలో ఆసీస్ పోరు ముగిసింది. ఇక నామమాత్రమైన(ఓమన్) మ్యాచ్ ఆడి ఇంటి ఇంటి బాటపట్టనుంది. గ్రూప్-బిలో ఆతిథ్య జట్టు శ్రీలంక, జింబాబ్వే సూపర్-8కు చేరుకున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ చరిత్రలోనే లీగ్ దశలోనే ఆస్ట్రేలియా నిష్కమించి చెత్త రికార్డును ముట్టకట్టుకుంది.
T20WORLD CUP: సూపర్-8కు జింబాబ్వే..ఇంటికి ఆస్ట్రేలియా
- Advertisement -
- Advertisement -



