- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నేపథ్యంలో సౌతాఫ్రికా ప్లేయర్లు ముందుగా ప్రాక్టీస్ కోసం ఐపీఎల్‌ను వదిలేయనున్నారు. దాంతో ఆర్సీబీలో ఆడుతున్న లుంగీ ఎంగిడి స్థానాన్ని జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో రీప్లేస్ చేస్తున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. మే 26 తర్వాత నుంచి ఆర్సీబీ ఆడే మ్యాచ్‌లకు ముజారబానీ అందుబాటులో ఉంటాడు. టీ20ల్లో 70 మ్యాచ్‌లు ఆడిన ముజారబానీ 3/8 బెస్ట్‌తో 67 వికెట్లు తీసుకున్నాడు.
- Advertisement -