- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నక్షత్ర అనే యువతి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్నేహితుడు జొమాటోలో కేక్ ఆర్డర్ చేశాడు. డెలివరీ సూచనల్లో ‘లీవ్ ఎట్ సెక్యూరిటీ’ అని రాయగా, కేక్ షాపు యజమాని దానిని శుభాకాంక్షల సందేశంగా పొరబడి కేక్‌పై ‘లీవ్ ఎట్ సెక్యూరిటీ’ అని రాశాడు. ఈ సంఘటనతో పుట్టినరోజు వేడుక నవ్వుల విందుగా మారింది. ఈ ఘటన వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. జొమాటో వారు ‘మర్చిపోలేని కామెడీ’ని ఉచితంగా డెలివరీ చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
- Advertisement -



