- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును భారీగా పెంచేసింది. ప్రతీ ఆర్డర్‌పై రూ.2.40 పెంచింది. 12.50 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును 14.90 రూపాయలు చేసింది. ఈ పెంపు నిర్ణయం ఈ రోజు (శుక్రవారం) నుంచే అమల్లోకి వచ్చింది. జొమాటో ఏటా ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతూ వెళుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. 10 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును 12.50 రూపాయలు చేసింది.
- Advertisement -



