నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్‌ఆర్ లోపల ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కొత్త జోనల్ కమిషనర్లతో సమావేశమైన సీఎం.. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
‘‘క్యూర్ పరిధిలో సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా చేశాం. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందే. జోన్ల వారీగా సమస్యలు పరిష్కరించే బాధ్యత కమిషనర్లదే. నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. నగరగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలి. క్యూర్ పరిధిలో డీజీల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు తీసుకురావాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నరెన్స్‌కు మారాలి. జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు చేపట్టాలి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు బాధ్యత తీసుకోవాలి’’ అని ఆదేశించారు.



