– మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ 2025
మాడ్రిడ్ (స్పెయిన్) : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ముంగిట.. మాడ్రిడ్ ఓపెన్ మట్టికోర్టు టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అలవోక విజయంతో ముందంజ వేయగా.. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్ (పొలాండ్) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. స్పెయిన్ ఆటగాడు రాబర్టో బటిస్టా ఆగట్‌పై అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-2, 6-2తో వరుస సెట్లలో గెలుపొందాడు. 10 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన జ్వెరెవ్.. రాబర్టోను చిత్తు చేశాడు. రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్‌కు వాకోవర్ లభించింది. క్రోయేషియా ఆటగాడు లాస్లో ఫిట్‌నెస్ సమస్యలతో తప్పుకున్నాడు. మూడో సీడ్, అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ 6-1, 6-4తో క్రిస్టోఫర్ (ఆస్ట్రేలియా)పై ఏకపక్ష విజయం సాధించాడు. 5 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో టేలర్ ఫ్రిట్జ్ అదరగొట్టాడు. గేల్ మోన్‌ఫిల్స్ సైతం వాకోవర్ ఇవ్వగా.. అండ్రీ రూబ్లెవ్ ముందంజ వేశాడు.
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వైటెక్ 4-6, 6-4, 6-2తో మూడు సెట్ల మ్యాచ్‌లో ఎలాపై పైచేయి సాధించింది. తొలి సెట్లో ఓడిన స్వైటెక్.. ఆ తర్వాత వరుస సెట్లలో పుంజుకుంది. అమెరికా క్రీడాకారిణీలు కొకొ గాఫ్ 0-6, 6-2, 7-5తో, మడిసన్ కీస్ 6-4, 6-3తో మెరుపు విజయాలు నమోదు చేశారు. ఆరో సీడ్ జాస్మిన్ పావొలిన్ 6-1, 6-2తో బౌల్టర్‌పై వరుస సెట్లలో విజయం సాధించింది.
జ్వెరెవ్, స్వైటెక్ ముందంజ
- Advertisement -