Magazines

ఎక్కడాగుతుందో..?

1 గంట క్రితం

will stop
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నేనిప్పుడు

పౌరుడ్నే కాదు

ఉద్యమకారుడ్ని కూడా..


​నా ఓటు కోసమే కాదు

ఓటులేని పౌరుల కోసం

ఉద్యమిస్తున్నా చూడు


ఉద్యమాలోచనలు

నన్నావహిస్తున్నాయి

ఉద్యమ పథంలో

నా అడుగులు పడుతున్నాయి

​రాజ్యానికిప్పుడు

రెండు ఉక్కుపాదాలు

పోలీసుది గుండాది



అణిచేకొద్దీ పెరిగే

ఆలోచనల పదును

అడుగుల పరుగు 


​మెట్లమీద నుంచి

ఖాళీ అధికార చెంబు

డొల్లుతోంది నేడు

ఎక్కడాగుతుందో చూడు


​ప్రజాస్వామ్య పోరాటం

ప్రాణం పోసుకునే

నవయుగ లక్షణం


​అర్థంకాని బత్తాయిలిక

తోకముడవడమే తరువాయి


– కె. శాంతారావు, 9959745723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్