214 పరుగులతో సఫారీలపై గెలుపు
డర్బన్ (దక్షిణాఫ్రికా) : దక్షిణాఫ్రికా, ఆస్ర్టేలియా తొలి టెస్టులో కంగారూలు ఘన విజయం సాధించారు. జోశ్ హేజిల్‌వుడ్ (6/49) ఆరు వికెట్లతో విజృంభించగా 421 పరుగుల రికార్డు ఛేదనలో దక్షిణాఫ్రికా 86.5 ఓవర్లలో 206 పరుగులకే చేతులెత్తేసింది. ఎడెన్ మార్క్‌రామ్ (75, 237 బంతుల్లో 10 ఫోర్లు), డెవిడ్ బెడింగ్హమ్ (46, 68 బంతుల్లో 8 ఫోర్లు), మార్కో యాన్సెన్ (35, 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇతర బ్యాటర్లు విఫలం అయ్యారు. రికెల్టన్ (2), బవుమా (1), స్టబ్స్ (1) నిరాశపరిచారు. ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 314/6 డిక్లేర్డ్ స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులే చేసింది. మాట్ రెన్షా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ర్టేలియా 1-0తో ముందంజ వేసింది.






కామెంట్‌లు (0)