Magazines

యూపీఐపై చార్జీలు వాయిదా

1 గంట క్రితం

Charges on UPI
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఎన్‌పీసీఐ
వ్యాపారుల వ్యతిరేకత భయమే కారణమా..!


న్యూఢిల్లీ: దేశంలో జెన్‌జీ ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో పండగల సీజన్‌ కూడా ముంచుకొచ్చిన నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై చార్జీల అమలును కేంద్రం వాయిదా వేసుకుంది. యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) చార్జీలను ఈ గురువారం నుంచి అమలు చేయాలన్న ప్రతిపాదనను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే కొత్త అమలు తేదీని ఇంకా వెల్లడించలేదు. ఎండీఆర్‌ చార్జీలు అమల్లోకి వస్తే వ్యాపారులపై అదనపు వ్యయభారం పడే అవకాశం ఉంది. ఆ భారాన్ని వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేస్తే డిజిటల్‌ చెల్లింపుల ఖర్చు పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదల, జీవన వ్యయంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న సమయంలో పండగల కొనుగోళ్ల వేళ కొత్త చార్జీలు అమలు చేస్తే వ్యాపారులు, వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎండీఆర్‌ అమలును వాయిదా వేయడం వెనుక వ్యతిరేకతపై ఆందోళనలు కూడా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తోన్నారు. యుపిఐ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పండుగల సీజన్‌తో పాటు అమలుకు సంబంధించిన సవాళ్లపై చర్చించినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. వ్యాపారులు, ఫిన్‌టెక్‌ సంస్థలు కూడా చార్జీల అమలును వాయిదా వేయాలని కోరినట్టు సమాచారం.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్