Magazines

చైనాలో వెయ్యి మంది గణిత శాస్త్రవేత్తలతో ఏఐ టాస్క్‌ఫోర్స్‌

1 గంట క్రితం

రాబోయే కాలంలో కృత్రిమ మేధ (ఏఐ)
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం


ఫీల్డ్స్‌ పతక విజేత షింగ్‌-టంగ్‌ యావ్‌ నేతృత్వం

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ సంస్థలకు దీటుగా చైనా టీమ్‌


బీజింగ్‌ : రాబోయే కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) పోరులో గణితానికి ప్రాధాన్యత పెరగబోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తమ పరిశోధనలో ఏఐని ఉపయోగించే వెయ్యి మందికి పైగా గణిత శాస్త్రవేత్తలతో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చైనా నిర్ణయించింది. ఏఐ సాయంతో 377 గణిత సమస్యలను ఏపెన్‌ఏఐ పరిష్కరించిన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. గణిత పరిశోధనలో ఏఐని అనుసంధానించేందుకు చైనాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు ఆదివారం బీజింగ్‌లో సమావేశమై టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించారని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తెలియజేసింది. దీనికి ఫీల్డ్స్‌ పతక విజేత షింగ్‌-టంగ్‌ యావ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు 'ది యావ్‌ లేబరేటరీ అలయన్స్‌ ఫర్‌ మాథమెటిక్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌' అని పేరు పెట్టారు. ఎనిమిది ప్రముఖ సంస్థలకు చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏఐ వినియోగంలో చైనా, అమెరికాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకే ఇది ఏర్పడిందని యావ్‌ తెలిపారు. ఏఐ ఇంత శక్తివంతమైనదని సంవత్సరం క్రితం తాను అనుకోలేదని ఆయన చెప్పారు. గణితశాస్త్రంలో ఏఐ అభివృద్ధి ఓ సునామీ అని వ్యాఖ్యానించారు. గణిత శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను తప్పించుకోవడానికి బదులు దానిలో మమేకం కావాలని సూచించారు. సాధారణ వినియోగదారుల కార్యకలాపాల విషయంలో చైనా నమూనాలు బాగా పనిచేశాయని, అయితే అత్యాధునిక పరిశోధనలో అమెరికా వ్యవస్థల కంటే చాలా వెనుకబడి ఉన్నామని యావ్‌ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్