పల్లెకొండ నారాయణమ్మకు నారాయణ కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని పటాన్‌చెరు ప్రాంతంలో గల ఇంద్రేశం కాలనీలో ఉన్న 1,045 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను (సుమారు రూ. 40 లక్షల విలువ) చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు పల్లెకొండ నారాయణమ్మ బహుకరించారు. దానికి సంబంధించిన రిజిస్ర్టేషన్ పత్రాలను సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు కె.నారాయణ, కోశాధికారి చెన్నకేశవులుకు నారాయణమ్మ అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారంగా విలువైన ఆస్తిని ఫౌండేషన్‌కు బహూకరించిన పల్లెకొండ నారాయణమ్మకు, వారి కుటుంబ సభ్యులకు సీఆర్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి దాతృత్వం సమాజ సేవకు మరింత తోడ్పడుతుందని ఆశించారు.







కామెంట్‌లు (0)