నవతెలంగాణ- హైదరాబాద్: రాజస్థాన్‌లోని అజ్మీర్ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి, మహిళ ఉన్నారని అన్నారు. హోటల్ నాజ్‌లో గురువారం ఉదయం 8.00 గంటల సమయంలో మంటలు చెలరేగాయని, నిమిషాల్లోనే మంటలు హోటల్‌ను చుట్టుముట్టాయని స్థానిక అధికారులు తెలిపారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పలువురు హోటల్‌లో నుండి దూకారని అన్నారు. తన బిడ్డను కాపాడుకోవడానికి, ఒక మహిళ ఆ బిడ్డను హోటల్ కిటికీ మూడో అంతస్తు నుండి విసిరేశారని అన్నారు. ఆ బిడ్డకు స్వల్పగాయాలయ్యాయని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం. మంటలకు ముందు పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఎసీ పగిలిపోవడం వలన ఇలా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని అన్నారు.
అజ్మీర్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..నలుగురు మృతి
- Advertisement -
RELATED ARTICLES