నవతెలంగాణ-హైదరాబాద్: అలహాబాద్ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్‌గాంధీ పౌరసత్వ హోదాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా, ఈ కేసుపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని లక్నో బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, ఆ తర్వాత కేసును ధర్మాసనం కొట్టివేసింది. రాహుల్‌గాంధీకి భారత్ తో పాటు యుకే (యునైటెడ్ కింగ్‌డమ్)లో పౌరసత్వం ఉందని కర్నాటక బీజేపీ నాయకులు విఘ్నేష్ శిశిర్ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. భారత్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి..ఎన్నికల్లో పోటీ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా విచారణచేపట్టిన అలహాబాద్ కోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అలహాబాద్ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES