రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం డైరెక్టర్ మారుతి ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”పాంచ్ మినార్’ టైటిల్ చాలా బాగుంది. గోవిందరాజు చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. సినిమాని చాలా రిచ్‌గా తీశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పడానికి కారణం మా డైరెక్టర్ కష్టం ఆయన విజన్. నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు’ అని హీరో రాజ్ తరుణ్ చెప్పారు. డైరెక్టర్ రామ్ కందుల మాట్లాడుతూ,’ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’ అని తెలిపారు.
ఆద్యంతం నవ్విస్తుంది
- Advertisement -
RELATED ARTICLES