‘#సింగిల్’ సినిమాలో వినోదంతో పాటూ ఎమోషన్ కూడా ఉంటుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూసి ఎంజారు చేసేలా ఈ సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను’ అని దర్శకుడు కార్తీక్ రాజు చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పతాకంపై కార్తీక్‌రాజు తెరకెక్కించిన చిత్రం ‘#సింగిల్’. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యాణ్ ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ రాజు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
నా ఫస్ట్ తమిళ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్. ఎస్‌పి బాలు ప్రొడ్యూస్ చేశారు. బేసిగ్గా నేను విఎఫ్‌ఎక్స్ సూపర్వైజర్‌ని. ‘పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు, సైనికుడు’ ఇలా చాలా పెద్ద తెలుగు సినిమాలకి వర్క్ చేశాను. అప్పుడే సినిమా డైరెక్షన్ పై ఆసక్తి ఏర్పడింది. సందీప్ కిషన్‌తో తెలుగులో ‘నిను వీడని నీడను’ సినిమా చేశాను.
కోవిడ్ సమయంలో ఈ కథని శ్రీ విష్ణుకి చెప్పాను. అప్పుడాయన ‘బ్రోచేవారెవరు’ సినిమా చేశారు. ఆయనకు కథ చెప్పిన తర్వాత దీన్ని గీతా ఆర్ట్స్‌లో చెప్పాను. వాళ్లకు కూడా చాలా నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. గీతా ఆర్ట్స్‌లో వర్క్ చేయడం అదష్టంగా భావిస్తున్నాను. సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు.
నేను శ్రీ విష్ణు నటించిన సినిమాలన్నీ చూశాను. విష్ణు బాడీ లాంగ్వేజ్ టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన్ని ఒక సెపరేట్ బాడీ లాంగ్వేజ్ టైమింగ్‌తో ఆడియన్స్ చూస్తారు. సినిమా ఫుల్ ఫన్ మూడ్‌లో ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. శ్రీవిష్ణు, వెన్నెలకిషోర్.. వీరిద్దరు చేసే ఫన్‌ని ఆడియన్స్ ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. ఇవానా, కేతిక ఇద్దరు అద్భుతమైన యాక్టర్స్. ‘లవ్ టుడే’ సినిమా చూసినప్పుడు ఇవానా పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా తన పర్ఫార్మెన్స్ క్యూట్‌గా ఉంటుంది. కేతిక కూడా తన పాత్రని అద్భుతంగా చేసింది. వీరిద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి.
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
- Advertisement -
- Advertisement -