Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడి.. 12మంది మృతి

ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడి.. 12మంది మృతి

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: మ‌రోసారి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై అమానుష దాడికి తెగ‌బ‌డింది.ఉత్తర గాజాలోని జబాలియాలో ఉద‌యం నుంచి ప‌లు ద‌ఫాలుగా బాంబుల వ‌ర్షం కురిపించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మ‌ర‌ణించార‌ని పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్న పిల్ల‌లు ఉన్నార‌ని వెల్ల‌డించారు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తు జ‌రిపిన దాడుల్లో 1978 మంది చ‌నిపోయార‌ని,5207 మంది గాయ‌ప‌డ్డార‌ని గాజా వైద్య‌శాఖ తెలిపింది. అదే విధంగా 50వేల‌కుపై పాల‌స్తీనా పౌరులు మ‌ర‌ణించార‌ని, ల‌క్ష‌కు పైగా ప్ర‌జ‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని ప్ర‌క‌టించింది. వంద‌ల సంఖ్య‌లో అమాయ‌క ప్ర‌జ‌లు గ‌ల్లంతు అయ్యార‌ని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img