నవతెలంగాణ – చండీఘడ్ : పంజాబ్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ప్రధాన సూత్రధారి హర్‌ప్రీత్ (హ్యాపీ పాసియా)ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఇఆర్‌ఓ) అధికారులు శుక్రవారం అమెరికాలో శాక్రమెంట్‌లో అరెస్టు చేశారు. రెండు అంతర్జాతీయ ఉగ్రవాదుల గ్రూపులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, అమెరికాకు అక్రమ పద్ధతిలో వెళ్లారని ఎఫ్‌బిఐ ఎక్స్ పోస్టులో పేర్కొంది. అతను పట్టుబడకుండా ఉండేందుకు బర్నర్ ఫోన్లని ఉపయోగించారని ఎఫ్‌బిఐ పోస్టులో పేర్కొంది.
- Advertisement -