Friday, May 16, 2025
Homeజాతీయంఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం మొహన్‌లాల్‌గంజ్ సమీపంలోని కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమైయ్యారు. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంట‌ల ధాటికి 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. డ్రైవర్, కండక్టర్ ప‌రారీలో ఉన్నార‌ని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -