నవతెలంగాణ – హైదరాబాద్: ఏఐపై ప్రపంచ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏఐ ప్రభావంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఏఐ లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఇది గత వందేళ్లలో ప్రపంచం చూడని అతిపెద్ద మార్పు కానుందని వారు స్పష్టం చేశారు.
బిల్ గేట్స్ మాట్లాడుతూ..ప్రస్తుతం అరుదుగా లభించే మేధస్సు (ఉదాహరణకు గొప్ప వైద్యులు, ఉపాధ్యాయుల నైపుణ్యం) ఏఐ సహాయంతో రాబోయే దశాబ్ద కాలంలో ఉచితంగా, సర్వసాధారణంగా అందుబాటులోకి వస్తుందన్నారు. “ఇది వైద్య సలహాలు, ట్యూటరింగ్ వంటి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే, ఇది ఉద్యోగాల స్వరూపాన్ని, పని విధానాలను పూర్తిగా మార్చివేస్తుంది. వారానికి రెండు, మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందేమో” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళుతుందని అంగీకరిస్తూనే, దానివల్ల కలిగే మార్పులు కొంత భయానకంగా ఉన్నాయని గేట్స్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికత గతంలోని అన్ని టెక్నాలజీ మార్పుల కంటే వేగంగా, మరింత ప్రభావవంతంగా ఉండబోతోందని హెచ్చరించారు. “ఇది కేవలం తయారీ రంగంలోని ఆటోమేషన్ లాంటిది కాదు. ఉన్నత స్థాయి మేధోపరమైన పనులను కూడా ఏఐ చేయగలదు. ఇప్పటికే చాలా మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల కంటే మెరుగ్గా ఏఐ కోడింగ్ చేయగలుగుతోంది. సిలికాన్ వ్యాలీలో మంచి జీతాలతో ఉన్న ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయి” అని ఒబామా వివరించారు.
ఏఐతో భారీ నిరుద్యోగం తప్పదు: బిల్ గేట్స్, ఒబామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES