రాహుల్ విజయ్, నేహా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. దీన్ని హిలేరియస్ ఫన్‌రైడర్‌గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీ నుంచి ‘ఏదో ఏదో..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటీఫుల్‌గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్‌తో పాడారు. ‘ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే…’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ – మోహన్ జి, కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి, ఎడిటర్ – ఉదరు కుమార్ డి, క్రియేటివ్ హెడ్ – బాబ్ సునీల్, డీవోపీ – కార్తీక్ కొప్పెర.
‘ఏదో ఏదో ఏదో జరిగెనే..’
- Advertisement -
RELATED ARTICLES