నవతెలంగాణ – అమరావతి: ఐపీఎల్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబయి నటి జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆంజనేయులును పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.
- Advertisement -