Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంకరాచీ తీరంలో పాక్ క్షిప‌ణి ప‌రీక్ష‌లు

కరాచీ తీరంలో పాక్ క్షిప‌ణి ప‌రీక్ష‌లు

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ అప్రమత్తమైంది. భారత్ ప్రతీకార చర్యలు దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా పాక్ వ్యవహరిస్తుంది. భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. కరాచీ తీరంలో ఉపరితలలం నుంచి క్షిపణిని పరీక్షించడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు పాకిస్థాన్ ఏజెన్సీలు ఈ నోటిఫికేషన్ జారీ చేశాయి. ఏప్రిల్ 24 – 25 మధ్య క్షిపణి పరీక్ష నిర్వ‌హించునుంది. ఈ పరిణామాలను నిశితంగా నిశితంగా గమనిస్తున్నామని భార‌త్ భద్రతా వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img