నవతెలంగాణ-హైదరాబాద్: కర్రిగుట్టపై భద్రతా బలగాల దాడులకు ముగ్గురు మవోయిస్టులు మృతి చెందారు. గురువారం ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ లోని కర్రిగుట్టపై మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. అడవుల్లో గాలింపు చేస్తుండగా మావోయిష్టులు భద్రతా బలగాలకు ఎదురుపడ్డారు. దీంతో వీరు వర్గాలు పరస్పరం కాల్పులు జరిపాయి.గంట పాటు జరిగిన భీకర దాడిలో ముగ్గరు మావోయిస్టులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. కర్రిగుట్టపై మావోయిష్టుల ఏరివేతే లక్ష్యంగా ఏప్రీల్ 21 సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 5 వేల మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కర్రెగెట్ట దండకారణ్యంలోకి అటవీ ప్రాంతాలను కలిపే గ్రామలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
కర్రిగుట్టపై కాల్పులు..ముగ్గురు మావోయిస్టులు మృతి
- Advertisement -
RELATED ARTICLES