Wednesday, April 30, 2025
Homeసినిమా'కలియుగమ్‌ 2064' రిలీజ్‌కి రెడీ

‘కలియుగమ్‌ 2064’ రిలీజ్‌కి రెడీ

‘జెర్సీ’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘డాకు మహారాజ్‌’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాథ్‌. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్సన్‌, అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కలియుగమ్‌ 2064’. కిషోర్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘ఆర్‌.కె.ఇంటర్నేషనల్‌’ సంస్థపై కె.ఎస్‌.రామకృష్ణ నిర్మించారు. ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మే 9న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో సమ్మర్‌ కానుకగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని టాప్‌ బ్యానర్‌ ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్‌’ సంస్థ విడుదల చేస్తుంది. ఇప్పటికే మణిరత్నం లాంచ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కి విశేషాదరణ లభించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ను దర్శకుడు రాంగోపాల్‌ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇదొక మంచి ఫ్యూచరిస్టిక్‌ అనుభూతిని కలిగించింది. ఫొటోగ్రఫి, క్యారెక్టర్స్‌ డిజైన్‌, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్‌.. ఇలా అన్నీ ఒక మోడరన్‌ కైండ్‌ ఆఫ్‌ బుక్‌ చదివిన ఫీలింగ్‌ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్‌ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి’ అని తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా ట్రైలర్‌లో చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్‌తో కలియుగంలోని పౌరాణిక ఇతివత్తాలను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img