Wednesday, April 30, 2025
Homeసినిమాకీలక షెడ్యూల్‌ పూర్తి

కీలక షెడ్యూల్‌ పూర్తి

ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు క్రేజీ కొలాబరేషన్‌లో చేస్తున్న సినిమా ‘ప్రేమంటే’. థ్రిల్‌-యూ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌లైన్‌. ఆనంది, సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో నవనీత్‌ శ్రీరామ్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్‌ పవర్‌ ఉమెన్‌ 2024 అవార్డు విజేత జాన్వి నారంగ్‌ చేస్తున్న తొలి ప్రొడక్షన్‌ వెంచర్‌ ఇది. తాజాగా ఈ చిత్రం థ్రిల్లింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. స్పిరిట్‌ మీడియా దీనిని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: నవనీత్‌ శ్రీరామ్‌, నిర్మాతలు: జాన్వీ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, సమర్పణ: రానా దగ్గుబాటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img