నవతెలంగాణ-హైదరాబాద్: కెనడాలో ఖలిస్థానీలు మరోసారి హిందు వ్యతిరేక ర్యాలీ చేపట్టారు.. 8 లక్షల మంది హిందువులను కెనడా నుంచి వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు భారత ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్‌లో పెట్టి ప్రదర్శించారు. కాగా.. వేర్పాటువాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవలే ఖలిస్థానీ మద్దతుదారులు ఓ గురుద్వారా, మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణం’’ అని రాసుకొచ్చారు. కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1985లో ఎయిర్ ఇండియా ‘కనిష్కా’ విమానంపై బాంబు దాడి జరింగింది. ఖలిస్థానీ వేర్పాటు వాదులు చేసిన ఆదాడిలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు.
కెనడా నుంచి హిందువులను పంపించండి: ఖలిస్థానీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES