Tuesday, April 29, 2025
Homeఆటలుక్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం..!

క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం..!

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌ శుక్రవారం మొదలైంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్‌ఎల్‌ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్‌లోనే బస చేశారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లోని ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు, సిబ్బందిని రక్షించారు. మంటల్లో ఎవరూ గాయపడలేదని.. వారిని అక్కడి నుండి మరో చోటుకి తరలించినట్లు పేర్కొన్నారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img