Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంగాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం దాడి.. 18మంది మృతి

గాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం దాడి.. 18మంది మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇజ్రాయిల్‌ సైన్యం గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ బాంబు దాడికి పాల్పడింది. ఈ దాడిలో దక్షిణ ఖాన్‌ యూనస్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా 18మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరోవైపు అమెరికా యెమెన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఎర్రసముద్రంలో ఇజ్రాయిల్‌, అమెరికా విమానాలపై దాడికి పాల్పడతామని హౌతీ గ్రూపు ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత అమెరికా యెమెన్‌పై దాడులు ప్రారంభించింది. కాగా, ఇదిలా ఉండగా.. పోప్‌ మరణం పట్ల పాలస్తీనా ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి పలువురు పాలస్తీనియన్లు సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img