Monday, May 5, 2025
Homeఅంతర్జాతీయంగాజాలో దాడల కంటే.. ఆకలిచావులే ఎక్కువ

గాజాలో దాడల కంటే.. ఆకలిచావులే ఎక్కువ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం వరుస దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ దాడుల వల్ల ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడుల వల్ల 40 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 125 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రత్వశాఖ తెలిపింది. కాగా, ఇజ్రాయిల్‌ సైన్యం దాడుల వల్ల మరణించినవారు కొందరైతే.. ఆకలికి తట్టుకోలేక మరెంతో మంది చనిపోతున్నారని మీడియా వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు సుమారు 3,500 మంది చిన్నారులు మృత్యువుకు చేరువలో ఉన్నారు. మరోవైపు ఆహార సరఫరాని ఇజ్రాయిల్‌ సైన్యం అడ్డుకోవడం వల్ల 290,000ల మంది చనిపోవడానికి సిద్దంగా ఉన్నారని గాజా మీడియా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -