– ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ – కంఠేశ్వర్
గ్రామ అభివృద్ధి కమిటీలపై నిషేధం ప్రకటించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట రాములు కోరారు. ఈ మేరకు శనివారం ఎరుగట్ల మండలం, తాళ్లరాంపురం గ్రామ గీత కార్మికుల సమస్యల పైన తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం పత్రిక విలేకరుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట రాములు మాట్లాడుతూ..ఆ గ్రామ అభివృద్ధి కమిటీ వారు గత ఆరు నెలలుగా అనేక ఇబ్బందులు పెడుతూ హర్తాల్ చేస్తూ హింసిస్తున్నారు. ఆటవిక రోజులను గుర్తు చేస్తున్నారు. ఆ గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు చూస్తుంటే మధ్య యుగం నాటి రాజరిక వ్యవస్థలు గుర్తొస్తున్నాయి. శ్రీరామనవమి నాడు గౌడ గీత కార్మికుల మహిళలకు అలాగే శ్రీరాముడికి అవమానపరిచిన దాఖలాలు మరువకముందే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు గౌడ గీత కార్మికులు దశాబ్దాలుగా పెంచి పోషించుకున్న వారి సొంత సొసైటీ భూమిలో ఉన్న ఈత చెట్లను సైతం నిర్దాక్షిణ్యంగా అగ్నికి ఆహుతి చేశారు. చెట్లు పెంచండి ప్రజారోగ్యాన్ని ఆక్సిజన్ ని పెంచండి అని ఓ పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటవీ శాఖ వాళ్ళు మొత్తుకుంటుంటే..! సమాజ పరిస్థితి, శ్రేయస్సు పట్టని గ్రామ అభివృద్ధి కమిటీ ఈరోజు గీత కార్మికులకు జీవన భృతి కి ప్రధానాతరమైన ఈత చెట్లను తగలబెట్టడం ఎంత ఆర్ధిక చర్య అర్థమైతున్నది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వారిని కఠినంగా శిక్షించి నష్టపోయిన గీత కార్మికులకు పది సంవత్సరాల పాటు కల్లుగీత వృత్తికి దూరమయేటట్టు చేసిన ఈ దారుణానికి ఒడిగట్టిన గ్రామఅభివృద్ధి కమిటీ వారి చేతనే చెల్లించాలని, తెలంగాణ కలుగత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. అలాగే గ్రామ అభివృద్ధి కమిటీల వారి పెత్తనం రోజు రోజుకు విషమిస్తున్నది. అందుకోసం గ్రామ వృద్ధి కమిటిలపై నిషేధం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదిఝ సాధించేంత వరకు పోరాటం నుంచి వెనకాడమని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు కోయడ నరసింహులు గౌడ్, సిడుగు శేఖర్ గౌడ్, శ్రీరామ్ గౌడ్లు పాల్గొన్నారు.