Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంచదువులో అంతరాలు పోవాలి

చదువులో అంతరాలు పోవాలి

– ప్రభుత్వ బడుల ద్వారానే సాధ్యం
– పిల్లలను ప్రభుత్వ బడులకే పంపాలి : తెలంగాణ పౌరస్పందన వేదిక అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ – ముషీరాబాద్‌
చదువులో అంతరాలు పోవాలి.. ప్రభుత్వ బడులు నిలబడాలని, ప్రభుత్వ బడుల ద్వారానే సామాజిక అంతరాలు తొలగిపోతాయని తెలం గాణ పౌరస్పందన వేదిక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో తెలం గాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రచారజాత కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని కోరారు. విద్యార్థుల మధ్య చదువులో అంతరాలు తొలగిపోవాలంటే ప్రభుత్వ బడులు నిలబడాలన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల మధ్య తారతమ్యాన్ని సృష్టిస్తున్నారని, అది విద్యాలోకానికి తీవ్ర అన్యాయమని, విద్యార్థుల మధ్య భేదా భిప్రాయాలను సృష్టిస్తుందని చెప్పారు. రాను రానూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 18.4 శాతం, హైదరాబాద్‌ జిల్లాలో 22.9 శాతం, రంగారెడ్డి జిల్లాలో 29.4 శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి, మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటట్టు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులు ప్రారంభించడానికి అవసరమైన గదుల నిర్మాణానికి, ఉపాధ్యాయుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం సమగ్రశిక్ష ద్వారా అదనపు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు తెలంగాణ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలన్నింటిలో ప్రీ-ప్రైమరీ తరగతులు జూన్‌ 2026లోగా ప్రారంభించాలని కోరారు. తరగతికొక గది, టీచర్‌ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన నివాస ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు పెట్టాలని, మధ్యాహ్న భోజనాన్ని ఆయా బడుల్లోనే ఏజెన్సీల ద్వారా వండించాలని అన్నారు. విద్యా పరిపాలన వ్యవస్థలో బడుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బడులను అభివవృద్ధి చేయాలని కోరుకునే విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు, బస్తీ కమిటీలు తెలంగాణ పౌర స్పందన వేదికతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కె.మంగ, రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ, ధనమూర్తి లక్ష్మణరావు, నాగమణి, రాములు, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు లెనిన్‌, ప్రశాంత్‌ కైలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img