నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కాలేజ్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా..పలువురికి గాయాలుఅయ్యాయి. బాధితులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20నుంచి 25 విద్యార్థులు ఉన్నారని, వారి అరుపులు విని..బాధితులకు సాయం చేయడానికి బస్సు వద్దకు వెళ్లామని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అంబులెన్స్‌కు పలుమార్లు ఫోన్లు చేసినా..స్పందన రాకపోవడంతో..ప్రయివేటు వాహనంలో బాధితులను స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించామన్నారు.
- Advertisement -