Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంజైపూర్‌లోని అంబర్‌ కోటను సంద‌ర్శించిన జేడీవాన్స్

జైపూర్‌లోని అంబర్‌ కోటను సంద‌ర్శించిన జేడీవాన్స్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ కుటుంబ సమేతంగా మంగళవారం జైపూర్‌లోని అంబర్‌ కోటను సందర్శించారు. వాన్స్‌ కుటుంబ సభ్యులకు యూనెస్క్‌ వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ వద్ద రాజస్థానీ సంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది. హతీ గావ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన చందా, పుష్ప అనే ఏనుగులు వాన్స్‌ కుటుంబానికి స్వాగతం పలికగా.. పలువురు నృత్యాలతో అలరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, సతీమణి ఉషా వాన్స్‌, పిల్లలు ఇవాన్‌, వివేక్‌, మిరాబుల్‌ సమేతంగా నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img