నవతెలంగాణ – హైదరాబాద్: 20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో అత్యధిక సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు రన్ మెషీన్ ఇలా 61 సార్లు 50+ పరుగులు చేశాడు. నిన్న చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం చేయడం ద్వారా ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఒకే వేదికలో 3500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ ఘనత కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే విరాట్ సాధించాడు.
- Advertisement -