నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ, కశ్మీర్ లోని పహల్గామ్ లో ఈ నెల 22న పాకిస్తాన్ టెర్రరిస్టులుచేసిన ఉగ్రదాడితో యావత్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. పర్యటకులే లక్ష్యంగా చేసుకొని అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండి పడటమే కాకుండా.. ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ పై పలు దౌత్యపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా ఆ దేశ పౌరులు గడువులోపు ఇండియాను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, ఆదేశస్తులను పంపించి వేయాలని, అందుకు తగ్గు చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. 5వేలమంది పాక్ పౌరులను గుర్తించారు. ఫారన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అందించిన డేటాతో పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజామును ప్రత్యేక దళంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు..5వేలమంది పాక్ పౌరులను గుర్తించారు. త్వరలోనే వారిని పాకిస్తాన్ పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. శనివారం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన అధికారులు పాకిస్థానీలతో పాటు బంగ్లాదేశ్ పౌరులను కూడా గుర్తించారు. అదే విధంగా హైదరాబాద్ లో కూడా దాయాది దేశస్తులను పోలీసులు గుర్తించారు. గడువులోపు పాక్ పౌరులు వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు.
ఢిల్లీని జల్లెడ పడుతున్న పోలీసులు.. 5వేల మంది పాక్ పౌరులు గుర్తింపు
- Advertisement -
RELATED ARTICLES