Wednesday, April 30, 2025
Homeసినిమాతెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌

తెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌

అజిత్‌ కుమార్‌ హీరోగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించగా, టి-సిరీస్‌ గుల్షన్‌ కుమార్‌, భూషణ్‌ కుమార్‌ సమర్పించారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ బ్లాక్‌ బస్టర్‌ సంభవం పేరుతో సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. నిర్మాత నవీన్‌ యర్నేని మాట్లాడుతూ, ‘ఈ సినిమాని రోహిణి థియేటర్స్‌లో చూసాం. థియేటర్‌ ప్యాక్డ్‌గా, ఆడియన్స్‌ ఎంజారు చేస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ విజువల్‌ని మర్చిపోలేను. సినిమా హ్యుజ్‌ బ్లాక్‌ బస్టర్‌. ఇదంతా మా హీరో అజిత్‌ వల్లే సాధ్యమైంది. డైరెక్టర్‌ అధిక్‌ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. అధిక్‌ ప్రొడ్యూసర్స్‌ డైరెక్టర్‌. ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేశాడు. ఇంత గ్రాండ్‌ స్కేల్‌ ఉన్న సినిమాని 95 డేస్‌లో కంప్లీట్‌ చేయడం మామూలు విషయం కాదు. అధిక్‌ లాంటి డైరెక్టర్స్‌ ఇండిస్టీకి కావాలి. జివి, ప్రియా, కార్తీక్‌కి థ్యాంక్స్‌. సునీల్‌తో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా రెండు గంటల రోలర్‌ కోస్టర్‌ రైడ్‌. ఎక్కడా ఆగదు. పరిగెడుతూనే ఉంటుంది. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్‌ అన్నిచోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. చాలా పెద్ద విజయం సాధించబోతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి మ్యూజిక్‌ స్ట్రాంగ్‌ పిల్లర్‌. జీవి ప్రకాష్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చాలా ఎంజారు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి థ్యాంక్స్‌. వాళ్లు తమిళంలో చేసిన ఫస్ట్‌ సినిమా ఇది. ఈ సినిమాతో తమిళ నాడులోనూ వీరు హిస్టరీ క్రియేట్‌ చేశారు’ అని డైరెక్టర్‌ అధిక్‌ రవిచంద్రన్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img