నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు.
ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25 రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్‌లో విలక్షణ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించు కున్న బిందు మాధవి భాగమయ్యారు. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ టచ్‌తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో శివాజీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిందు మాధవి కూడా జాయిన్ కావటం విశేషం. ఫస్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది.
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు.
‘దండోరా’లో వేశ్యగా..
- Advertisement -
RELATED ARTICLES