యూపీ బీజేపీ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీమార్, ఒడిసా, మహారాష్ట్రల్లో తరుచుగా అట్టుడుగు వర్గాలపై, ఆ వర్గాలకు చెందిన మహిళలపై దాడులు నిత్యకృత్యమని ఆయన ఆరోపించారు. ఈ తరహా దాడులపై బీజేపీ ప్రభుత్వం బాధ్యతవహించాలని, ఎందుకుయ ఆయా రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఆ వర్గాలకు చెందిన మహిళల పట్ల అసభ్యప్రవర్తన,వేధింపులకు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపీ రాష్ట్రంలో దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసిందని వివరించారు. ‘బీజేపీ..సాంప్రదాయ ఆధిపత్యవాదుల పార్టీ. ఆ పార్టీ ఆలోచన పూర్తిగా భూస్వామ్యంగా ఉంటుంది. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, గిరిజనులు చిదరింపులకు గురువుతున్నారు’ అని మీడియాతో అన్నారు.
దళితులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్: అఖిలేష్ యాదవ్
- Advertisement -