Wednesday, April 30, 2025
Homeఖమ్మందీర్ఘకాలం సెలవు పెట్టిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

దీర్ఘకాలం సెలవు పెట్టిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ అనారోగ్యం కారణంగా సోమవారం దీర్ఘకాలం సెలవు కు జెడ్పీ సీఈఓ కు దరఖాస్తు చేసారు. ఈ పోస్ట్ లో ప్రస్తుతానికి ఇంకెవరికి ఇంచార్జి కానీ వేరొకరిని నియమించడం కానీ చేయలేదు. జులై లో ఎంపీడీఓ శ్రీనివాస్ రిటైర్డ్ కావడంతో ఆగస్ట్ నెలలో దమ్మపేట ఎంపీడీఓ ఇంచార్జీ గా విధులు నిర్వహించారు. ఇల్లందు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ను రీ డిప్లాయిడ్ విధానంలో అశ్వారావుపేట పూర్తికాలం ఎంపీడీవో గా బదిలీ పై సెప్టెంబర్ లో వచ్చారు. అయితే ఇటీవల హృద్రోగ సంబంధం వ్యాధితో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయన నెల రోజులు సెలవులకు దరఖాస్తు చేసారు.సీఈఓ నివేదిక ప్రకారం కలెక్టర్ వేరొకరిని ఎంపీడీఓ గా నియమిస్తారు. అసలే నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేట మండలం రాజకీయ, సామాజిక, భౌగోళికంగా ప్రత్యేక ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పధకాన్ని అమలు చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తుంది.ఈ పధకం అమలు ఎంపీడీఓ పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు. ఇంత ప్రాధాన్యత లు మధ్య పని చేయాలంటే సీనియర్ అధికారులు అయితే సమన్వయం చేసే అవకాశం ఉంటుంది. నూతన ఎంపీడీవో గా ఎవరు వస్తారో వేచి చూద్దాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img