నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్బీనగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఉస్మానియా యూనివర్సిటీ, కంటోన్మెంట్, పటాన్‌చెరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
- Advertisement -