Wednesday, April 30, 2025
Homeజాతీయంనేటి నుంచి అప్పన్న స్వామి టికెట్లు

నేటి నుంచి అప్పన్న స్వామి టికెట్లు

నవతెలంగాణ – అమరావతి: సింహాచల పుణ్యక్షేత్రంలో ఈ నెల 30వ తేదీన అప్పన్న స్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని తిలకించి అప్పన్న స్వామి కృపాకటాక్షాలు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో సింహగిరిపై అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్ల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కె. సుబ్బారావు వెల్లడించారు. అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం ఈ నెల 24వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఈవో తెలిపారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img