నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయంది. మరోవైపు, మిగతా ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.
- Advertisement -