నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. లండన్ పర్యటన సమయంలో వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమన్లు అందాయి. లండన్ పర్యటన సమయంలో రాహుల్ సావర్కర్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ రాహుల్‌పై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో తేల్చారు. కాగా.. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం మే 9న ఆయన తమముందు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది.
- Advertisement -