నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. పాఠశాల విద్యలో సంస్కరణలు, జీతాలు, ప్రోత్సాహకాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత నెలరోజులుగా ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. పాఠశాల విద్యా బిల్లుని పార్లమెంట్ ఆమోదించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం వేలాది మంది ఆందోళనకారులు ఖాట్మాండ్‌లో నయాబనేశ్వర్‌లోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి భద్రతా వలయాన్ని ఛేదించేందుకు యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనాన్‌లను ప్రయోగించారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయని అన్నారు.
నేపాల్‌లో ఉద్రిక్తత..ఉపాధ్యాయులపై లాఠీచార్జ్
- Advertisement -
RELATED ARTICLES