Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంన్యూయార్క్‌లో విమాన ప్రమాదం..

న్యూయార్క్‌లో విమాన ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: న్యూయార్క్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్‌షెరీఫ్‌ జాక్వెలిన్‌ సాల్వటోర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మృతుల వివరాలను ఆమె వెల్లడించలేదు. అయితే, ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img