నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ) విచారణను ప్రారంభించింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ (ఎంహెచ్‌ఎ) ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. బుధవారం ఘటనా స్థలికి చేరుకున్న తమ బృందం సాక్ష్యాధారాల కోసం అన్వేషణను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన ఐజి,డిఐజి, ఎస్‌పిల పర్యవేక్షణలో తమ బృందాలు ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నాయని ఎన్‌ఐఎ ప్రతినిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బైసరన్ లోయ ప్రవేశ, నిష్క్రమణ దారులను నిశితంగా పరిశీలిస్తున్నాయని అన్నారు. ఫోరెన్సిక్, ఇతర నిపుణుల సాయంతో దాడి జరిగిన ప్రాంతాన్ని తమ బృందాలు జల్లెడ పడుతున్నాయని అన్నారు.
‘పహల్గాం’ విచారణలో దూకుడు పెంచిన NIA
- Advertisement -
RELATED ARTICLES